యువత మత్తుకు దూరంగా ఉండాలి: కార్డన్ అండ్ సెర్చ్

4చూసినవారు
యువత మత్తుకు దూరంగా ఉండాలి: కార్డన్ అండ్ సెర్చ్
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా 'వజ్ర ప్రహర్' కార్యక్రమంలో భాగంగా శనివారం ఓబుళవారిపల్లి మండలం మంగంపేటలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ నేతృత్వంలో అనుమానిత ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, దీనిపై సమాచారం ఉంటే డయల్ 100కు తెలపాలని ఎస్సై మహేష్ నాయుడు కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్