
శ్రీ సాయి వికాస్ హైస్కూల్‌లో అక్షరాభ్యాస మహోత్సవం
రైల్వే కోడూరులోని శ్రీ సాయి వికాస్ హైస్కూల్‌లో మాఘశుద్ధ పంచమి సందర్భంగా అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా జరిగింది. విద్యాదేవత సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, 3 నుంచి 5 ఏళ్ల వయసున్న 36 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసి నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల కరస్పాండెంట్ తిరుమల రెడ్డెయ్య తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






































