
అడవి పందుల దాడి: అన్నమయ్యలో బొప్పాయి పంట ధ్వంసం, రైతుల ఆవేదన
అన్నమయ్య జిల్లా, చిట్వేలు మండలం కే. కందులవారిపల్లి గ్రామ సమీపంలో అడవి పందులు 8 ఎకరాల బొప్పాయి పంటను ధ్వంసం చేశాయి. కందుల శంకరయ్య, ఈశ్వరయ్య, మురళి, లక్ష్మమ్మ, రెడ్డమ్మలకు చెందిన సుమారు 7 వేల మొలకలు నాశనమయ్యాయి. ఒక్కో మొలక రూ.32 చొప్పున కొనుగోలు చేయగా, దుక్కులు, డ్రిప్ పైపులు, కూలీల ఖర్చులతో కలిపి సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని వారు కోరారు. నష్టాన్ని గ్రామ రెవెన్యూ అధికారి, ఉద్యాన శాఖ సహాయకురాలు, అటవీ శాఖ ప్రతినిధి పరిశీలించారు.








































