రైల్వే కోడూరు - Railway Koduru

టీడీపీలో కొత్త ఉత్సాహం: నూతన మండల అధ్యక్షుల ఘన సన్మానం

టీడీపీలో కొత్త ఉత్సాహం: నూతన మండల అధ్యక్షుల ఘన సన్మానం

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం, నూతనంగా ఎన్నికైన పెనగలూరు మండల అధ్యక్షులు ఎంజర్ల నారాయణ రెడ్డి, చిట్వేలి మండల అధ్యక్షులు కాకర్ల నాగార్జునలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు పదవులు రావడం సంతోషకరమని, మండల కమిటీలు బాధ్యతగా పనిచేసి కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కస్తూరి విశ్వనాథ నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా