రాజంపేటలో ఏసీబీ దాడులు

2చూసినవారు
రాజంపేటలో ఏసీబీ దాడులు
రాజంపేట సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అధికారులు కార్యాలయ తలుపులు మూసివేసి సిబ్బందిని అదుపులోకి తీసుకుని, పత్రాలను పరిశీలిస్తూ లావాదేవీలపై విచారణ కొనసాగిస్తున్నారు. దాడుల సమాచారం తెలిసిన రైటర్లు, మధ్యవర్తులు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడుల పూర్తి వివరాలు, పట్టుబడిన వారి సంఖ్యపై సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్