సుండుపల్లి మండలం జీకే రాచపల్లికి చెందిన హీన్నాయా తుల్లా అనే వికలాంగుడు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పదేళ్ల క్రితం కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి 90 శాతం వికలాంగుడైన ఆయన, స్వగ్రామానికి తిరిగి వచ్చి పొంగనాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఆయన, ప్రభుత్వం మూడు చక్రాల వాహనం మరియు వికలాంగుల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.