రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి

550చూసినవారు
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి
రాజంపేట జిల్లా కేంద్రం ఏర్పాటు డిమాండ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ విజయవాడ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, వినతులు సమర్పించారు. చిట్వేల్ మండలం అనుంపల్లి వద్ద రెండు నూతన బ్రిడ్జిల నిర్మాణం, ఫోర్ లైన్ హైవే పనులను వేగవంతం చేయడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, హార్టికల్చర్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, ప్రధాన గ్రామాల మధ్య కనెక్టింగ్ రోడ్ల విస్తరణ, అభివృద్ధి వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. ఈ అభ్యర్థనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్