సిద్ధవటంలో చిరుత కలకలం

3చూసినవారు
సిద్ధవటంలో చిరుత కలకలం
సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు. టిడిపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ, చిరుత రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తోందని, రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని, తక్షణమే చిరుతను బంధించి రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్