ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందని టిడిపి రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త పోలి సుబ్బారెడ్డి తెలిపారు. భాకరాపేట గ్రామంలోని ఎన్టీఆర్ ప్లే గ్రౌండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాచుపల్లి, కడప జట్ల మధ్య జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు రూ. 1,16,000 ప్రథమ బహుమతిగా, రూ. 50,116 ద్వితీయ బహుమతిగా, రూ. 15,116 తృతీయ బహుమతిగా అందజేస్తామని తెలిపారు.