జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

7చూసినవారు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, హరిదాసు–బుడబుక్కల వేషధారణ, భోగి మంటలు, ఆటపాటలతో వేడుకలు సందడిగా సాగాయి. ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్