
చెరువులో ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అల్లుకోల వద్ద హరిసాగరం చెరువులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలో ఐదుగురికి గాయాలయ్యాయి. చెరువులో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




