ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇంచార్జి చామర్తి జగన్ మోహన్ రాజు బుధవారం ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడమే దీని లక్ష్యం. ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్, పేపర్ వంటి పొడి చెత్తను ఈ రథానికి అందిస్తే, బదులుగా సబ్బులు, పప్పులు, నూనె వంటి 17 రకాల నిత్యావసర వస్తువులను తక్షణమే పొందవచ్చు. ఈ వినూత్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.