రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్. ఎస్. భావన రెవెన్యూ అధికారులకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పూర్తి వివరాలతో భూ యాజమాన్య పాసుపుస్తకాలు త్వరగా అందించాలని సూచించారు. బుధవారం సుండుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాసుపుస్తకాల పంపిణీ పురోగతిని పరిశీలించి, ఖాతాల పూర్తి స్థితి, పెండింగ్ వివరాలు తెలుసుకున్నారు. పాసుపుస్తకాలలో ఫోటోలు, సంతకాలు, ఫోన్ నంబర్లలో ఉన్న తప్పులను సరిచేయాలని, భూయజమానుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.