ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడే సూచనలున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి (D) చిట్టమూరులో 88.5 మి.మీ, చింతవరంలో 81 మి.మీ, నెల్లూరులో 61 మి.మీ, పాలూరులో 60 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.