రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అయింది. గత ప్రభుత్వ తప్పిదంతో రాజంపేట సంక్షోభంలోకి వెళ్లిందని, బద్వేల్ నియోజకవర్గాన్ని కలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని సోమవారం మేడా మల్లిఖార్జున రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై ఆయన వివరణ ఇచ్చారు.