రాజంపేట మండల మున్సిపల్ సమావేశంను శుక్రవారం ఉదయం 7 మంది టిడిపి, 4 వైసీపీ కౌన్సిలర్లతో కలిసి సమావేశాన్ని బహిష్కరించినారు. మున్సిపల్ సమావేశాన్ని చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, ఎంపీ మేడా రఘు నాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిర్వహించినారు. సమావేశాలు నిర్వహించకపోవడమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేయడం లేదని టిడిపి, వైసిపి కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. మునిసిపల్ కార్యాలయానికి ఎంపీ లాండ్స్ కింద రెండు ట్రాక్టర్లను ఎంపీ రఘునాథరెడ్డి ప్రారంభించారు.