రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని
టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి
జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజాదర్బార్' కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని చమర్తి హామీ ఇచ్చారు.