శుక్రవారం రాజంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన్నూరు సింగిల్ విండో చైర్మన్, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజంపేట టీడీపీ ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు నాయకత్వంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద పారిశుధ్య పనులు, విద్యుత్ సమస్యలు, మౌలిక వసతులు, ఇతర ప్రజాసంబంధిత అంశాలపై చర్చించారు. సమావేశం సజావుగా కొనసాగింది.