రాజంపేట టౌన్ NTR సర్కిల్ సమీపంలోని చక్రాలమడుగు కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం రాజంపేట అర్బన్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి రూ. 3, 620 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ బి. నాగార్జున తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.