రాజంపేట: విద్యార్థి పై 12 మంది దాడి.. తీవ్ర గాయాలు

5చూసినవారు
రాజంపేట: విద్యార్థి పై 12 మంది దాడి.. తీవ్ర గాయాలు
రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శాంతన్ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. ఒక సంవత్సరం క్రితం జరిగిన గొడవ కారణంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన శాంతన్ రెడ్డిని 108 సేవ ద్వారా కడప రిమ్స్‌కి తరలించారు. బాధితుని తల్లిదండ్రులు 12 మంది నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్