రాజంపేట: రైతును రాజును చేయడమే లక్ష్యం: చమర్తి

23చూసినవారు
రాజంపేట: రైతును రాజును చేయడమే లక్ష్యం: చమర్తి
రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ, ప్రపంచానికి అన్నం అందించే రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజంపేట మండలం మందరం గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :