అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ దాడులు –ఐదు ట్రాక్టర్లు స్వాధీనం

13చూసినవారు
సిద్ధవటం మండలం టక్కోలి పెన్నా నది నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై శుక్రవారం రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండల తాసిల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ, గ్రామస్తుల సమాచారం మేరకు అక్రమ రవాణాను గుర్తించామని తెలిపారు. ఉచిత ఇసుక గ్రామ ప్రాంతాల్లో నివసించే ప్రజలు గృహ నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించు కోవాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్