ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాలి

5చూసినవారు
ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాలి
ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని రాజంపేట ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్‌లో డిపో మేనేజర్ అధ్యక్షతన జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. డిపో మేనేజర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, పొగమంచు వేళ వేగ నియంత్రణ అవసరమని తెలిపారు.

ట్యాగ్స్ :