సుండుపల్లె మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) వెంకటేష్ నాయక్, రవీంద్ర నాయక్ మంగళవారం బడి ఈడు వయసున్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. 'బడి పండుగ' కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతో కలిసి ఉర్దూ బెస్తపల్లి, మన్యంవారిపల్లి గ్రామాల్లో పర్యటించి, ఐదేళ్లు నిండిన పిల్లలు, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల నమోదు డ్రైవ్ చేపట్టారు.