సిద్ధవటం మండలం మాచుపల్లి పెన్నానదిలో జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానిక రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లోకి తోలుకోవాలని రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొంది, ఆ ఇసుకను కడపకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి, బోర్లలో నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ తిరుమల బాబు వివరణ ఇస్తూ, పొలాల కొరకే అనుమతి ఇచ్చామని, ఇసుక విక్రయిస్తే చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.