మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా, టీడీపీ మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు బుధవారం సుండుపల్లి మండలం బండకాడ ఈడిగపల్లిలోని అత్తా–కోడళ్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. చెరువుల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మత్స్యకారులంతా ఐక్యంగా ఉండి అక్రమ వేటను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.