తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఆర్.వడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండా రామాలయాన్ని ఘనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని దేవాలయ అభివృద్ధికి సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు.