ఒంటిమిట్ట: అనిశా వలలో వీఆర్వో

1605చూసినవారు
ఒంటిమిట్ట: అనిశా వలలో వీఆర్వో
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరుకు అవసరమైన ఎన్వోసీ జారీ చేయడానికి లంచం తీసుకుంటుండగా మంటపంపల్లె రెవెన్యూ అధికారి వై.శ్రీనివాసులు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గుంటికాడిపల్లెకు చెందిన చింతకుంట రాజారెడ్డి, రమణారెడ్డిలు తమ వ్యవసాయ భూములకు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ. 9 వేలు లంచం, రూ. 2 వేలు చలానా రుసుం చొప్పున మొత్తం రూ. 22 వేలు ఇవ్వాలని వీఆర్వో శ్రీనివాసులు డిమాండ్ చేయగా, చివరికి రూ. 20 వేలకు అంగీకరించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజారెడ్డి అనిశా అధికారులను సంప్రదించగా, వారి సూచనల మేరకు రూ. 15 వేలు ఇస్తుండగా అధికారులు శ్రీనివాసులును ఒంటిమిట్టలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్