చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం: ఎస్సై

2చూసినవారు
చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం: ఎస్సై
సిద్దవటం మండలం ఎస్సై హారిక, ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సదస్సులో మహిళలు, పిల్లల భద్రత, చట్టాలపై అవగాహన అవసరమని తెలిపారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ మోసాలపై మహిళలను అప్రమత్తం చేశారు. బ్యాంకు వివరాలు అడిగే ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య వస్తే 1098, 1930 నెంబర్లను సంప్రదించాలని కోరారు. పిల్లలు ఫోన్లకు బానిస కాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్