రాజంపేట జిల్లా కేంద్రం కోసం మహిళల ర్యాలీ

34చూసినవారు
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజంపేట మండలం వైబీఎన్ పల్లి, ఎగువ బసినాయుడు గారి పల్లిలో మహిళలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, వైసీపీలకు అతీతంగా సీఎం సామాజిక వర్గానికి చెందిన మహిళలు ముందుండి నడిపించిన ఈ ర్యాలీలో, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ గ్రామ వీధుల్లో భారీగా కదిలారు. రాజంపేటకు న్యాయం చేయాలని, జిల్లా కేంద్రంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్