రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన వేలంలో కాకినాడ కింగ్స్ జట్టు ఆయన్ను రూ. 4 లక్షలకు కొనుగోలు చేసింది. హరిశంకర్ రెడ్డి గతంలో జోనల్
టీ20, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ఇప్పటివరకు టీ20ల్లో 23 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు, లిస్ట్-Aలో 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశారు.