
ఉద్యోగం ఇవ్వని కంపెనీలపై క్షుద్ర పూజలు చేసిన యువకుడు
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చినా స్పందన రాకపోవడంతో నిరాశ చెందిన ఒక యువకుడు, హాంగ్‌కాంగ్‌లో 'విలన్ హిట్టింగ్' అనే పురాతన ఆచారం ద్వారా తనను పట్టించుకోని కంపెనీలపై పగ తీర్చుకున్నాడు. కంటెంట్ క్రియేటర్ షో దివాన్, దాదాపు రూ.470 ఖర్చు చేసి, తనను విస్మరించిన కంపెనీల పేర్లను చెప్పి, చెప్పుతో కొట్టి శాపనార్థాలు పెట్టించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.




