అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.