అంగన్‌వాడీల ఆరోపణ: మోసం చేసిన కూటమి ప్రభుత్వం

3చూసినవారు
రాయచోటిలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు మంగళవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. బడ్జెట్ లేదని సాకులు చెబుతూనే, నాయకుల జల్సాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదని నేతలు రామాంజులు, భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు హామీలిచ్చి, ఇప్పుడు తమను మోసం చేశారని వారు మండిపడ్డారు. ఈ ర్యాలీ ద్వారా అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్