అరెస్టులు దుర్మార్గం: లక్కిరెడ్డిపల్లిలో అంగన్‌వాడీల ధర్నా

11చూసినవారు
అరెస్టులు దుర్మార్గం: లక్కిరెడ్డిపల్లిలో అంగన్‌వాడీల ధర్నా
విజయవాడలో అంగన్‌వాడీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు అధ్యక్షురాలు జాల సుకుమారి మంగళవారం తీవ్రంగా ఖండించారు. అరెస్టులకు నిరసనగా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాల సుకుమారి మాట్లాడుతూ, ఎన్నికల ముందు లోకేష్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు రెండేళ్లయినా నెరవేర్చలేదని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్