రాయచోటి మాసాపేట మార్కెట్ యార్డులో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో RAD కార్యక్రమం కింద రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.