జనవరి 20న రాయచోటి డైట్‌లో జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు

4చూసినవారు
జనవరి 20న రాయచోటి డైట్‌లో జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు
ఉమ్మడి వైయస్ఆర్ కడప జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు జనవరి 20న రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. విద్యార్థుల సహజ కళా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా చిత్రలేఖన, హస్తలేఖన, ముగ్గులు, జానపద నృత్యం, పాత్రాభినయం విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 6, 7, 8 తరగతుల విద్యార్థులు అర్హులు. విజేతలను జనవరి 23న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్