శనివారం రాయచోటిలోని చిత్తూరు రోడ్డులో గల ఎస్టీ కాలనీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై మాట్లాడుతూ, మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్లు, మానసిక ఒత్తిడి, నరాల బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. మద్యపాన వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వారికి ఎక్సైజ్ శాఖ డీ-అడిక్షన్ కేంద్రాల్లో పూర్తి సహాయం అందిస్తామని, మత్తుపదార్థాల వినియోగం కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు.