కారు ఢీకొని వృద్ధురాలు మృతి

1చూసినవారు
కారు ఢీకొని వృద్ధురాలు మృతి
రాయచోటి–వేంపల్లి రహదారిపై చింతకుంట వాళ్లపల్లె సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 75 ఏళ్ల కే. పకీరమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. లక్కిరెడ్డిపల్లి నుంచి కాలాడివాళ్లపల్లెకు కాలినడకన వెళుతున్న ఆమెను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పకీరమ్మ అక్కడికక్కడే మరణించినట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్