గాలివీడు: వెలిగల్లు నీటితో రైతులను ఆదుకోవాలి: సిపిఐ

2చూసినవారు
గాలివీడు: వెలిగల్లు నీటితో రైతులను ఆదుకోవాలి: సిపిఐ
గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు నుండి మాధవరం, గొట్టివీడు, గోరన్ చెరువు గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించాలని CPI(ML) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ, బోర్లు వేసినా నీరు పడక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి కోసం గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి, రైతులను చైతన్యపరిచి, సాగునీరు అందే వరకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్