గాలివీడు: పెట్రోల్ కోసం పరుగులు! పుకార్లే కారణం!!

9చూసినవారు
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న పుకార్లతో గాలివీడులో వాహనదారులు మంగళవారం రాత్రి బారులు తీరారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు దేశంలో కనీసం 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ధరల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. గాలివీడు పోలీస్ వెల్ఫేర్ బంక్ వద్ద రద్దీ పెరిగినా, సరఫరాలో అంతరాయం లేదని సిబ్బంది తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్