లక్కిరెడ్డిపల్లె: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

4చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లె సీఐ వెంకట కొండారెడ్డి మంగళవారం కోనంపేట సచివాలయంలో గ్రామస్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్