అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్కిరెడ్డిపల్లిలో శనివారం విద్యార్థినులతో కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై డి. శోభ మాట్లాడుతూ, మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ద్రౌపది ముర్ము, ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజకీయ, పాలనా విభాగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.