లక్కిరెడ్డిపల్లి మండలం పందేళ్లపల్లి గ్రామంలో బుధవారం కరెంట్ షాక్‌తో శ్రీరాంపురం గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామంలో విద్యుత్ పనులు జరుగుతున్న సమయంలో లైన్‌మెన్ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రవహించి రమణకు షాక్ తగిలిందని బంధువులు ఆరోపించారు. గాయపడిన రమణను వెంటనే కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.