రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా మంగళవారం మధుసూదన వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత, వైస్ ప్రిన్సిపల్ మునియా నాయక్, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అందరి సహకారంతో కళాశాల అభివృద్ధికి, విద్యార్థులలో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని నూతన ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.