మహానాడులో శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి

522చూసినవారు
మహానాడులో శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి
లక్కిరెడ్డిపల్లి మండలంలోని షేక్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన మొదటి క్లస్టర్ మహానాడు సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, యువత సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశయాలకు ప్రతీక అని, మహానాడు కార్యక్రమాలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా పనిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్