అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తన చాంబర్‌లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ రూపొందించిన 'మీ డబ్బు-మీ హక్కు' గోడపత్రికను ఆవిష్కరించారు. క్లైమ్ చేయని ఖాతాలు, బీమా పాలసీలు, షేర్ల రూపంలో ఉన్న ఆర్థిక ఆస్తులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. చిరునామా మార్పు లేదా నామినీ వివరాలు లేకపోవడం వల్ల ఖాతాదారుల డబ్బు బీమా సంస్థలు, బ్యాంకుల్లో నిలిచిపోతుందని కలెక్టర్ తెలిపారు.