టీడీపీ పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల మేరకు అన్నమయ్య జిల్లా పునర్విభజనలో భాగంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని మదనపల్లి, తిరుపతి, కడప జిల్లాలకు విస్తరించారు. ఈ మార్పులు 2026 నూతన సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నియోజకవర్గంలో మదనపల్లి జిల్లా నుంచి పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, తిరుపతి జిల్లా నుంచి రైల్వే కోడూరు, కడప జిల్లా నుంచి రాజంపేట నియోజకవర్గాలు భాగం కానున్నాయి.