రామాపురం: గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ తొలగింపు

1చూసినవారు
రామాపురం: గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ తొలగింపు
రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై ప్రమాదవశాత్తు అడ్డంగా పడిపోయిన గ్యాస్ ట్యాంకర్‌ను పోలీసులు, ఫైర్ సిబ్బంది బుధవారం విజయవంతంగా తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు లేపారు. ట్యాంకర్ అడ్డంగా పడటంతో ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. లీకేజీ ప్రమాదం ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను యధావిధిగా పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you