రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి

13చూసినవారు
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి
రాయచోటిలోని నివాసంలో అనారోగ్యంతో రామసముద్రం పోలీస్‌ స్టేషన్‌ హెడ్ కానిస్టేబుల్ బత్తల లక్ష్మీనారాయణ (HC-2004, 1993 బ్యాచ్) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం గాలివీడు మండలం కరిమిరెడ్డిగారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.